Thursday, February 13, 2014

మేడారం జాతర...పద్య రచన





తోడుగ పోదము రారే!
మేడారముజాతరంట మేలుగ జరుగున్
వేడగ సమ్మక్కనచట

ఈడేర్చులెనీప్సితములు నింతులు గొలువన్


సమ్మక్కనుసారక్కను
సమ్మతముగవేడుకొనగ స్వాగతమనుచున్
కమ్మని బంగారమునిడి
నిమ్మళముగపూజచేయ నెలకొను సిరులున్






No comments:

Post a Comment