Sunday, October 6, 2013

బ్రహ్మచారిణి

                                                                       బ్రహ్మచారిణి

నవరాత్రులలో రెండవరోజున  దేవి బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారు,..ఒకచేత జపమాల ఒకచేత కమండలము ధరియించి, భక్తుల కోర్కెలు తీర్చే దేవి రూపం శోభాయమానం..


మత్తకోకిల.....

సన్నుతించెద బ్రహ్మచారిణి సన్నుతించెద బ్రామరీ
సన్నుతించెద జ్యోతిరూపిణి సద్గుణావతి సాత్వికీ 
నన్నుగావవె మాలధారిణి  నాగభూషణ శాంకరీ
నిన్నువేడిన సజ్జనాళికి నిత్యసంపద గల్గునే

1 comment: