Thursday, October 10, 2013

కాత్యాయనికి..వందనం..

                                                               కాత్యాయని (లక్ష్మి)

                నవరాత్రులలో ఆరవరోజున దేవి కాత్యాయని రూపమును ఆరాధించెదరు..ఈమె బంగారు వర్ణముతో,నాలుగు చేతులలో వరుసగా అభయముద్ర, వరముద్ర, ఖడ్గము, పద్మములను ధరించి సౌమ్య రూపమున భక్తులను గాచును,ఈమెను సేవించినవారికి అమోఘఫలములనిచ్చును

మత్తకోకిల.....

మూడుమూర్తుల తేజమందిన ముగ్ధమోహిని కాశ్యపీ
వేడుకొన్నచొ   వేగవత్తువు   వేదమాతవు   శాశ్వతీ
ఏడులోకము  లేలుతల్లికి   ఏమిపూజలు చేతునూ
చూడచూడగ  దేవిరూపము చూచువారికి  భాగ్యమూ


No comments:

Post a Comment