చిదంబరం
చిదంబరం,..నటరాజస్వామి ఆనందతాండవం చేసేఈ ఆలయానికి కోయిల్ అనే పేరుకూడా వుంది,..అలాగే మరొక నామం తిల్లయ్ అని కూడా పిలుస్తారు..
పాండిచ్చేరి నుండి బస్ లో రెండున్నర గంటలు పడుతుంది చిదంబరం చేరేసరికి, చాలా పెద్ద ఆలయం. తొలి ప్రాకారంలోంచి మందిరంలోకి ప్రవేశించగానే ఆనంద నటరాజస్వామి నాట్యంచేసే అద్బుత రూపం సాక్షాత్కరిస్తుందిమాటలలో చెప్పలేని అలౌకిక ఆనందాన్ని చూపరులకు కల్గిస్తుంది.స్వామి పక్కనే అమ్మవారి విగ్రహం ్అందాలొలుకుతూ అలరిస్తుంది..
ఆ ప్రాకారంలోనే గోవిందరాజ పెరుమాళ్ ఆలయం కూడా వుంటుంది.ఇక్కడ ఒకచోట నిలబడి అటు శివుడిని, ఇటు విష్ణువుని చూడవచ్చు..ఈ విధంగా మరెక్కడా లేదు..నటరాజస్వామి వారిని దర్సించాక, అక్కడవున్న పూజారులు ఆ గుడి గురించి ,దైవాన్ని గూర్చి తమిళంలో చెపుతారు,. చిదంబరం, అన్న ముక్క తప్ప మరేమీ అర్దం కాదు తమిళ్ రాకపోతే, మా పరిస్తితి అలాగే అయ్యింది,..పక్కన వున్న ఇంగ్లీషు వచ్చిన వారు వివరించారు,..ఆ వెంటనే ,చిదంబర రహస్య గురించి చెప్పి ఒక్క 5 సెకెండ్స్ చూపిస్తారు...
నటరాజస్వామి కుడివైపున ఒక చిన్న ద్వారం వుంటుంది, అక్కడ గోడకు ఒకయంత్రము బిగించబడి వుంటుందని అక్కడ చెబుతారు, అది యంత్రమో,, చక్రమోఎవరికీ సరిగ్గా తెలియదు,ఆ యంత్రం వున్న భాగంపై చందనం అద్ది వుంటుంది, ఆ యంత్రం వుండే స్తలాన్ని భక్తులు కిటికీ సందుల గుండా చూస్తారు , అదీ కొన్ని క్షణాలు మాత్రమే,పూజ జరిగాక పూజారి హారతి ఇస్తారు , ఆ వెలుగులో యంత్రం ముందు వున్న తెరను తెలగించి చూడమంటారు, ా యంత్రంపై బంగారు బిల్వపత్రాల మాల కన్పిస్తుంది, అదీ హారతి వెలుగులోనే కన్పిస్తుంది,తెర ఎత్తగానే ఒక అపురూప తేజం,కనులముందు మెరుస్తుంది, అదే నిరాకారుడైన దేవుని ఉనికిని తెలియజెసే సూచన,అదే చిదంబర రహస్యం,
శివదేవుడి ఉనికి రూపాలు 5 రకాలుగా వుంటాయని అంటారు, అవి జల, వాయు అగ్ని, భూమి, ఆకాశంచిదంబరంలో ఆకాశ, రూపంగా కొలుస్తారు,..చిదంబర రహస్యం, ఓ అద్బుతం, ఆశ్చర్యం, ఎవరి భావన ప్రకారం, ఆ రూపంలో నిరాకారుడైన ఆ దేవదేవుని రూపం కన్పిస్తుంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతికల్గిస్తుంది,..
ఆలయమంతా నాట్యకళాసంబంధమైన శిల్పాలతో అందంగా వుంటుంది,.. ప్రతీ ఒక్కరూ ఒకసారైనా దర్శించాల్సిన క్షేత్రం ,భూలోక కైలాసం,చిదంబరం...
No comments:
Post a Comment