అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
శంకరాభరణం బ్లాగులో పద్యరచన , సమస్యా పూరణలకు , నేను వ్రాసిన పద్యములు..సరిదిద్దిన శ్రీ పండిత నేమాని గురువుగారికి, శ్రీ కందిశంకరయ్యగురువుగారికి, శ్రీ వరప్రసాద్ గారికి,నా కృతజ్ఞతాభివందనములు...
సమస్యా పూరణ..."వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును..."
సంచితములవలన సామీప్య జన్మలన్ని
సంక్రమించుచునుండునుసతుల కెపుడు
జీవితములనడుమ నన్ని చిక్కుముడులె
సంక్రమించుచునుండునుసతుల కెపుడు
జీవితములనడుమ నన్ని చిక్కుముడులె
వలదు వలదనకొన్న సంప్రాప్తమగును
నేటి పద్యరచన "తెలుగు జాతి మనది"
నేటి పద్యరచన "తెలుగు జాతి మనది"
తెలుగు జాతి మనది తెలివి కలదిలలో"
తెలుగు భాష మనది తేనె లొలుకు
తెలుగు నేల మనది తేజమై నలరగ
తెలుగు వీర నీవు దెలుసు కొనుము
తెలుగు భాష మనది తేనె లొలుకు
తెలుగు నేల మనది తేజమై నలరగ
తెలుగు వీర నీవు దెలుసు కొనుము
ఉత్యాహ ..
తెలుగుదనము చాట నీవు తెలుగు పాట పాడరా!
జ్వలన విషమ భావ శిఖలు సంయమమున నార్పరా!
తెలుగు జాతి మనది యని మదిన్ విపంచి మీటరా!
తెలుగు తల్లి కనులు తుడిచి తిలక మొప్ప దిద్దరా!
తెలుగుదనము చాట నీవు తెలుగు పాట పాడరా!
జ్వలన విషమ భావ శిఖలు సంయమమున నార్పరా!
తెలుగు జాతి మనది యని మదిన్ విపంచి మీటరా!
తెలుగు తల్లి కనులు తుడిచి తిలక మొప్ప దిద్దరా!
No comments:
Post a Comment