శంకరాభరణం బ్లాగులో ఇవ్వ బడిన సమస్యా పూరణ,పద్య రచనలకు నేను వ్రాసిన పద్యాలు ,సరిదిద్దిన శ్రీ పండిత నేమాని గురువుగారికి ధన్యవాదములు...
త్రాగి పాడెనంట త్యాగరాజు.
నయము మీర రామ నామామృతమ్మును
రామ భక్తిలోన రంగరించి
లలిత నాదమందు రామరసమునింపి
త్రాగి పాడెనంట త్యాగరాజు
పద్యరచన..
"ఆటవిడుపు"
నిత్యమొక్క పనిని నెరవేర్చుచుండిన
విసుగుబుట్టునపుడు వింతగాను
ఆటవిడుపు వలన నలసట తీరును
సరళమగును పనులు సౌఖ్య మలర
రామజోగి మందు ప్రాణ హరము.
నమ్ము నేది మనసు నాశంబు కోరదు
అమ్ముకున్న వాడు అధముడయిన
పంపునీరు అయిన ప్రాణప్రదంబగు
రామజోగి మందు ప్రాణహరమ
( జిలేబి గారి భావమునకు నేను వ్రాసినది క్రింది పద్యము)
రావణునికి మందు రామచంద్రుండేను
కాల గతిన భోగి కర్మ యోగి
మనుజ మేధ కు గన మార్పులె మందవౌ
రామజోగి మందు ప్రాణ హరము
వావ్...చక్కగా రాసారు.
ReplyDeleteకృతజ్ఞతలు..
ReplyDeleteచాలా బాగున్నాయి ఈ లైన్ల పదప్రయోగాలు .
ReplyDeleteలలిత నాదమందు రామరసమునింపి
త్రాగి పాడెనంట త్యాగరాజు
నిత్యమొక్క పనిని నెరవేర్చుచుండిన
విసుగుబుట్టునపుడు వింతగాను
ఆటవిడుపు వలన నలసట తీరును
సరళమగును పనులు సౌఖ్యమలర
అమ్ముకున్న వాడు అధముడయిన
రావణునికి మందు రామచంద్రుండేను
కాల గతిన భోగి కర్మ యోగి
పద్యములు అన్నియు చదివి ,మీ అభిప్రాయం చక్కగా తెలియజెసినందుకు ధన్యవాదములు...
ReplyDelete