శంకరాభరణం బ్లాగులో...
ఈనాటిపద్యరచన అంశము...
..... ... ప్రకృతి.......
నేను వ్రాసిన పద్యము...
ఈనాటిపద్యరచన అంశము...
..... ... ప్రకృతి.......
నేను వ్రాసిన పద్యము...
ప్రబలుచుండు మాయ ప్రకృతి రూపమ్మున
పూజ్య దైవ మాయె పురుషుడనుచు
మాయ మాసిపోవ మాధవుడెదురౌను
మర్మమెరిగి నీవు మసలుకొనుమ...
పూజ్య దైవ మాయె పురుషుడనుచు
మాయ మాసిపోవ మాధవుడెదురౌను
మర్మమెరిగి నీవు మసలుకొనుమ...
పద్యాలు వ్రాస్తూవుంటే నా చిన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చాయి,.మా
సొంతవూరు, అందమైన పల్లెటూరు..నాగులచవితి పండగకి అనుకుంటాను సరిగ్గా గుర్తులేదు,..నందమ్మ పండగని మా వూర్లో చేసేవారు,..ఆ పండగకి ముందునుండి రోజూ నాటకాలు, బుఱ్ఱకధలు,వేసేవారు,..కుమ్మరి మాస్టారి బుఱ్ఱకధ, చాలా ఫేమస్ ,ఇంకా , కురుక్షేత్రం నాటకం ..మయసభ సీనులు,..సత్యహరిశ్ఛంద్ర నాటకం ,బాలనాగమ్మ, ఇలా నాటకాలు వేసేవారు ..అర్ధంకాకపోయినా , నాన్నగారిని అడిగి మరీ చూసేదాన్ని,..అందులో బావా ఎప్పడు వచ్చితీవు అన్న పద్యం,..చెల్లియో చెల్లకో అనే పద్యం.. ముందుగ వచ్చితీవు , అనే పద్యం ఇలా కొన్ని పద్యాలు గుర్తున్నాయి...
పద్యం పాడటమంతా బాగానే వుండేదిగానీ..చివర తీస్తారే
గుక్కతిప్పుకోకుండా ఆ..ఆ..ఆ..అనే రాగం, ఎప్పటికీ పూర్తయ్యేది
కాదు,..ఎంత ఎక్కువ సేపు రాగం తీస్తే అంత గొప్పగా పాడారని అర్ధం అట...
గుక్కతిప్పుకోకుండా ఆ..ఆ..ఆ..అనే రాగం, ఎప్పటికీ పూర్తయ్యేది
కాదు,..ఎంత ఎక్కువ సేపు రాగం తీస్తే అంత గొప్పగా పాడారని అర్ధం అట...
అలాగే హరిశ్ఛంద్ర లో వారణాశిని వర్ణించే పద్యం చాలా నచ్చేది...ఎన్నిసార్లు
ఆ నాటకాలు వేసినా అందరూ ఎంతో ఇష్ఠంగా చూసేవారు..మా వూరుకి
చుట్టూ వున్న గ్రామాలనుంచి కూడా చూడటానికి వచ్చేవారు...మావూరి
రామమందిరం దగ్గర స్టేజిపై ఇలాంటివన్నీ జరిగేవి..తెల్లవార్లూ మంచులో
అలానే కూర్చుని చూస్తూ , చూస్తూ, నేను ,చెల్లి, అమ్మ ఒడిలో
నిద్రపోయేవాళ్ళం...బాల్యంలో పద్యంపట్ల వున్న ఆ మక్కువే ఇప్పటి
వరకూ వుంది...ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఓ తీపి జ్ఞాపకం...

another sweet memory :-)
ReplyDelete