Tuesday, August 13, 2013

నా జ్ఞాపకాలలో .ఓరుగల్లు.....

                                    
                                  భద్రకాళి అమ్మవారి గుడి

                        వరంగల్(ఓరుగల్లు) ..దగ్గరలోనే వున్న చారిత్రాత్మక ప్రదేశం,.అనుకోకుండా ఒకరోజు ట్రయినింగ్ కేంప్..ఎప్పటినుండో చూడాలనుకుంటున్న వాటిల్లో ఓరుగల్లు ఒకటి,.ఆ కోరిక  ఈ కేంప్ తో తీరింది.. ముందస్తుగా ట్రయినింగ్ స్పాట్ కి  వెళ్తూనే మద్యలోభద్రకాళి అమ్మవారి గుడిని దర్శించుకున్నాం,ఆ కోవెల చాలా అందంగా , విశాలంగా,ముచ్చటైన గోకులంతోగుడిని ఆనుకుని మంచి కోనేరుతో,అలరారుతున్నది,భద్రకాళి అమ్మవారుచూడ కన్నుల వేడుకగా,ప్రశాంతంగా,అతిమనోహరంగా ఉన్నారు,..వరంగల్ లో చాలా షాపులు,మొదలైన వాటికి భద్రకాళి అమ్మవారి పేరుతో వున్నాయి,..



                                                   వేయిస్తంభాలగూడి...
                 చూడగానే ఓ కోరిక తీరిన పీలింగ్..చాలా విశాలమైన ఆవరణలో నెలకొనివున్న వేయిస్తంభాలగుడిఆనాటి శిల్పుల అద్వితీయమైన శిల్పకళకు మచ్చుతునక, ఎటువంటి మార్పులు ,చేర్పులు లేక ఎలా వున్నది అలానే వున్నది,..అయితే అదిచూసేవరకూ, వేయిస్తంభాలు విడివిడిగా (వుంటాయనుకున్న) కాక కలిసే వుంటాయని తెల్సింది,
ఆ స్తంభాల మంటపం ముందు పెద్ద నందీశ్వరుని విగ్రహం కొలువై చూపరులను ఆకర్షిస్తుంది, నందిని కొలిచి , అక్కడ పొటోస్ తీసి,లోన కొలువైవున్న రుద్రేశ్వరస్వామిని దర్శించి,అక్కడంతా కలయతిరిగి, పంతులుగారు ఇచ్చిన పులిహోర ప్రసాదం(చాలా బాగుంది)తీసుకుని వేయిస్తంభాలగుడి జ్ఞాపకాలను ఫొటోస్ రూపంలో భద్రంచేసుకుని వచ్చేసాం..
          అయితే ఒక్కటి మటుకు చాలా భాదేసింది, తగిన సంరక్షణ లేక, అంత గొప్ప చారిత్రాత్మక కట్టడం దైన్యంగా వుంది, పురావస్తుశాఖ ఎందుకు ఆలా ఆ గుడిని వుంచేశారో అర్దంకాలేదు... ఇక వరంగల్ ఫోర్ట్ చూడటానికి , అప్పటికే చీకటిపడటంతో, గోదావరికి ముందే రిజర్వేషన్ అయి వుండటంతో తిరిగి స్టేషన్ కి వచ్చేశాం...

No comments:

Post a Comment