నెలకేడు దినముణలని గణింతురు...అన్న భావనకి నేను వ్రాసిన
గేయమిది....
ఏమో గఱ్ఱం ఎగరావచ్చు
నెలకేడు దినములు రానూ వచ్చు
బడికే వెళ్ళని రోజే వచ్చు
బ్లాగులె బడులై మారావచ్చు
...ఏమో..
మనిషే కాలం తిప్పెయ్యొచ్చు
మనసే చదివే చదువే వచ్చు
వయసే వెనుకకు నడవా వచ్చు
వరసలన్నవి పోనూ వచ్చు
...ఏమో..
ఋతువులే గతి తప్పావచ్చు
బతుకున మెతుకే పోనూవచ్చు
వత్సరాల వడి తగ్గావచ్చు
మాసాలన్నవి మడిచెయ్యొచ్చు
...ఏమో...
కలలే నిజమవ్వావచ్చు
ఇలయే కలగా కరగా వచ్చు
నెలకేడు దినములవ్వావచ్చు
నెలఱేడే దిగి రానూ వచ్చు ....ఏమో..
No comments:
Post a Comment