Friday, August 23, 2013

శంకరాభరణం.



సమస్యా పూరణ......రామభక్తులలో మేటి రావణుండు




పవన సూనుండు, హనుమయు, పక్షిరాజు,
భక్త కంచర్ల గోపన్న, పడతి శబరి,
రామ భక్త శేఖరులు, వైరమ్ము వలన
రామ భక్తులలో మేటి రావణుండు.



పద్యరచన..అంశము.....జనారణ్యము....





అడవులన్ని నేడు నంతరించుచుండె
కడకు పట్టణాలు కాన లాయె
మేకవన్నెపులుల కాకరమైనట్టి

జన విపినములను గనుడు నేడు

1 comment:

  1. అభివృధ్ధి పధం నీ ఈ పద్యాలలో అగపడ్తుంది . అలా అలా ముందుకు దూసుకుపోవటం ఎంతైనా మంచిదే .

    ReplyDelete