“నా మనసే ఉప్పొంగే నిను చూడంగా
నడయాడే కళ్ళెదుటే పావనగంగా..
పాపాలను శాపాలను కడిగేయంగా
పరవళ్ళుతొక్కుతూ ప్రవహించెవేగంగా...”.
6 నెలలక్రితం గంగానదిని చూసినపుడు
,కన్నులపండువగా గంగాహారతి ని ఆతల్లి ఒడి లో 2 గంటలుకూర్చుని చూస్తున్నప్పుడు నాలో
కలిగిన భావావేశం పాటగా ఉరికింది అదే ఈ పాట
..పల్లవి..
నేటి ఛార్ ధామ్ యాత్రా విశేషాలు వింటుంటే..చూస్తూంటే....వేదన....అలవికాని రోదన....
శివుని జటాజూటం జడలముడి వీడెనా... లేక
.....గంగా ఆగ్రహమా...
ఆనాడు ..భగీరధుని మనోరధం ఈడేర్చడానికి
..వున్మత్తమానసవిహంగయై..చెంగు, చెంగుమని దూకుచూ ,చెలరేగిపోవుచూ..అలా సాగుచూ,చెలరేగుచున్న గంగను తన శిఖలోబంధించినాడు ఆ పరమశివుడు...తన జాడ ఎరుగని గంగ వడిగా వడివడిగా వెళ్తూ జహ్నుముని ఆశ్రమాన్ని ముంచివేసినదిట...
ఈనాడు..సాక్షాత్తు శివనివాసమైన ఆ పుణ్యస్థలాలను, ..25 అడుగుల ఎత్తున్న శివమూర్తిని సైతం..తన ఉత్తుంగ తరంగ వేగంతో ముంచివేసి
..వేలకొలదీ జనాలను, జనా వాసాలను, తనలో
కలుపుకుని , భయభ్రాంతులను చేస్తున్న ఆ
తల్లిని ఆపగలిగే నాధుడెవ్వరు..
“ ఏ భగీరధుడు పిలిచాడని ....? ఇంత
ఉగ్రరూపంతో..నీతోపాటు, నీసోదరిలను కూడా వెంటనిడుకుని వచ్చావు తల్లీ..”
“ఇది కలియుగం..నీ ధాటిని ఆపగలిగే ఆ
మహేశ్వరుడు గాని, ఆ జహ్నుముని లాంటి మునులు రాని, రాలేని కాలమిది..ఇకనైనా నీ ఆగ్రహాన్ని చాలించి” ..
వడివడి, త్వరపడి, వురవడి, సడివిడి...
భువిపై జాలిపడి..
కరుణరస మూరంగ..కల్యాణగంగవై..
కడగండ్లు ఇకచాలు ....కరుణించు “వే” “గంగ”..
6 నెలల క్రితం మీకు అనుభూతమైనది కవిత రూపంలో బాగుంది .
ReplyDeleteఇవన్నీ చక్రభ్రమణాల్లాంటివి . ఎవరు వేడినీ , వేడకున్నా ఆ సమయం వస్తే అవే ఆగిపోతుంటాయి . ఆ ఆగిపోయే సమయంలో మన విన్నపం చేరితే , మన విన్నపం విన్నాడని , కరుణించాడని భావిస్తుంటాం . మన కాలపరిధి బహు తక్కువే .
అన్నీ తెలిసినప్పటికీ.... ఆదిదేవుని పై నమ్మకం ఆదినుంచీ ఉన్నదేగా....ఏది ఏమైనా స్పందించింనందుకు సదా ధన్యవాదాలు....
ReplyDelete