Tuesday, June 25, 2013

పద్యం --హృద్యం..



పద్యాలంటే అందరికీ ఠక్కున గర్తు వచ్చేవి ..వేమన పద్యాలు..
బాల్యంనుండీ ..ఆడుతూ ,.పాడుతూ, అలవోకగా నేర్చుకున్న పద్యాలవడం వల్లనేమో అవంటే నాకు చాలా ప్రీతి...
వేమన ఆశుకవి..ఆయన పద్యాలు ..తన శిష్యుల చెవుల్లోకి,..అక్కడినుండి తాటాకుల్లోకి ప్రవహించాయని అంటారు..
వేమన ప్రజాకవి,..ఆటవెలదితో అందమైన కవిత్వం, విలువలతో కూడిన సలహాలు..అతని పద్యాల సొత్తు..పండిత,పామర జనరంజకంగా పద్యాలల్లుట ఒక్క వేమనకే స్వంతం...
ఈ మద్యనే ..చందోభాషణ (fb page) చూడటం జరిగింది...ఎంతమంది కవులు ..తమ కలాలను కరవాలాల్ల ఝడిపిస్తున్నారు..పదాలతో చదరంగం ..ప్రాసలతో పరవశం కల్గిస్తున్న ఎందరో మహానుభావులు ...
ఆ పద్యాల పూలతోటలో విహరించి , .ఆ సువాసలను ఆఘ్రాణించిన మీదట పద్యం వ్రాయాలనే కోరిక మళ్ళీ తలెత్తింది...
మళ్ళీ అని ఎందుకన్నానంటే ..గతంలో కొన్ని వ్రాశాను..అయితే నావి చందోబద్దమైన పద్యాలు కావు..భావాలను పద్యంగా మలచడానికి నే చేసిన చిన్న ప్రయత్నం...
  
ఆశుకవిత్వం పలికే కవులున్న ఈ ఇలని
 ప్రాస వచ్చినగాని.... ప్రతివారు కవులవునా
               ఆశ పడినగాని ..........ఆకాసమందునా
                సీసపద్యమెట్లు...........శ్రీనివాసా

చిత్తమున స్మరియించి తల్లిని
విత్తును మనమున నాటితిని
చిత్తం..ఆదేవి కృపా, జలధారలనడిగితిని
పుత్తడి పదపంటకోరి ,చేరా,భారతి,చెంతని..


                      నీది నాది అంటేనే వాదు
                      మనది అన్నమాటే చేదు
                      ఏదినీది,..ఏదీ మనది
                      ఎంచి చూడ ఏదియు లేదు

ఒకరా..ఇద్దరా...సంఖ్యకు అందని కవులెందరెందరో...
చకచకమని కందంతో  పందెమువేయునదెందరో..
లకలకయని ఆటవెలది ...ఆడింతురింకెందరో...
రకరకముల సీసము సువాసనల  తేలించునదెందరో..
ఒకరు ,..కాదు ప్రతి ఒకరికి ..వందనమన్నది డెందము.
సకలకళా ప్రవీణులకు..సాహిత్యపు సర్వులకు....




2 comments:

  1. పద్యం గురించి తెలియదు కాని , మీరు మరలా ప్రయత్నం చేయటం మంచి విషయమే .
    " నీది నాది అంటే వాదు " అనటం కంటే , నీది నాది అంటేనే ( లేకుంటే , అన్నదే ) వాదు అంటే బాగుంటుందనిపించిది . ఇలా నా భావాన్ని తెలియచేసినందులకు తప్పుగా భావించకమ్మాయ్ . కొంచెం చూడమ్మాయ్

    ReplyDelete
  2. నమస్తే సర్...మీలా చెప్పేవారుంటేనే కదా..తప్పొప్పులు తెలిసేది.మీ సూచనే బాగుంది,..అలానే మార్చాను..నాబ్లాగుచూసి విలువైన మీ ఆభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు...

    ReplyDelete