పత్తి నీవె , వత్తి నీవె
విత్తు మేసే ఆపత్తు నీవె
కుత్తుకలో అనురక్తి నీవె
జిత్తులమారి, శక్తివినీవె
ముచ్చటగొలిపే మూడవకన్ను
ముచ్చెమటలు పట్టించెనయా
విచ్చుకుతిరిగే విషసర్పాలే
విచ్చుకత్తిలా మారెనయా
అచ్చట శూలపుభీషణకేళికి
కచ్చిక నేల రాలెనయా
పచ్చికైనను మొలవదయా
పిచ్చుకలపైబ్రహ్మాస్త్రమేలయా
హంగులు లేని లింగమూర్తివి
కొంగజపాలకు లొంగని సామివి
మింగుడుపడనీ ఎంగిలయినదా
జంగమదేవర గంగనొదిలితివి...
పాపాలే పెరిగినవో భువిని
శాపాలే తగిలినవో ఎవని
రూపాలే మరిగినవో జనని
కోపాలకు గురిఅయినదే అవని
'ముచ్చటగొలిపే మూడవకన్ను
ReplyDeleteముచ్చెమటలు పట్టించెనయా '
చాలా బాగుంది .
' హంగులు లేని లింగమూర్తివి ' ఇది ఒప్పు ,కొంగజపాలకు లొంగని సామివి ఇది తప్పు . ఎందుకంటే ఈయనకు " బఃఓళా శంకరుడు " అనే అతి పెద్ద పేరు . అటువంటప్పుడు కొంగ జపాలు చేసే దొంగ సాములకు ( నరులకు ) అతి సులభాంగా లొంగిపోయే వాడే ఈయన .
ఒకచోట పిచ్చుకలపై బదులు పిచ్చుకలవై ప్రచురణ అయింది .
నమస్తే సర్...మీ సు-నిశిత విమర్శకు దన్యవాదాలు..కొంగజపాలవంటి, దొంగ జపాలకు శివుడులొంగిపోతాడంటారా...భోళా శంకరుడే గానీ, భక్తికే వశుడు అంటారే....రావణుడు, భస్మాసురుడు, మార్కండేయుడు, ఇత్యాది వారందరూ అపర శివ భక్తాగ్రేశరులు కదా..వారి అచంచలమైన భక్తిని దొంగ జపం అనగలమా..అకుంఠిత దీక్షతో చేసే ,నిశ్చలభక్తికి తప్ప మరి దేనికీ లొంగడని ..అలా వ్రాసాను...
ReplyDeleteభోళాశంకరుడు అంటే ఏ మాత్రం , ఎవరు తనని తల్చుకొనగానే , ప్రత్యక్షమై అడిగిన తడవే యిచ్చేస్తుంటాడు . ఆ అడిగినవాడి చరిత్రతో పనిలేదు . తనకు పెళ్ళాం బిడ్డలున్నారని , వాళ్ళు తన గురించి ఆలోచిస్తారని , తన కొరకు ఎదురుచూస్తారని కూడా ఆలోచించకుండా ఏదడితే అది యిచ్చేస్తాడు .
Deleteఆ తర్వాత ఆ పెళ్ళాం బిడ్డలు ( పార్వతి , విఘ్నేశ్వరుడు , కుమారశ్వాములు ) వెతుకులాట మొదలెడ్తారు .
ఇదీ ఆయన చరిత్ర. అయితే మన మానవులు తెలుసుకోవలసినదేమిటంటే ప్రపంచంలో భర్త మీద ఆధారపడ్డ భార్యని , వారిరువురి పిల్లలని యిలాంటి అవస్థలకు గురి చేయకూడదని ప్రతి భర్త తెలుసుకొని తీరాలి .
ప్రతి పురాణాలలో ఇటువంటివి మనం గ్రహించుకుని , జీవితానికి అన్వయించుకొని , ఆచరించ ప్రయత్నిస్తే , వెంటనే కాకున్నా , కొన్నాళ్తికైనా మనలో మాధవుడిని చూడగలం .