ఈ మధ్యన చందోభాషణ (fb
page) చూసిన దగ్గరనుంచి పధ్యాలమీదకే మనసు పోతోంది,.
ఆటవెలదికి వేమన,...సీసానికి శ్రీనాధుడు పెట్టింది పేరట, ఆటవెలది సులువుగ
వ్రాయవచ్చు అని చదివాను, చిన్నప్పుడు చదివిన చందస్సు....గుర్తుకుతెచ్చుకుని, అంతర్జాలాన్ని
శోధించి, ఎలాగైనా పధ్యాలు వ్రాయడానికే ప్రయత్నిస్తున్నా,..మామూలుగా పద్యాలయితే
వస్తున్నాయి కానీ...వాటిని, చందస్సులో బంధించడానికే, పాట్లుపడాల్సి
వస్తోంది,..అయినా నా కలం గో యె హెడ్ , అంటోంది,..ముందు,ముందు, చందంలో బంధించే
పద్యాలు పెడతాను..ప్రస్థుతానికి, మందం గా వున్న పద్యాలు ....
నెట్టింట్లో ఉండుతప్ప
నట్టింట్లో వున్నదెపుడు
గట్టిగ నీ ఎలుక పట్టి
పట్టుకు తిరిగెదము కాదా ఓ విఘ్నేశా
..
మంచిని ముంచిన కాలమిది
వంచన కంచికి చేరనిది
కొంచెమైనను కంచంలోకి
నంచుకులేనిదే నడవనిది
ఆలయమ్మున నంది నతిభక్తితోకొల్చి
ఫలముకై ఆశించు పూజ్యజనము
ఇంటిముందున్న గంగిగోవును గొట్టి
ఏల హింసింతు రిది..ఏమి మూఢతనము
శైలజ గారు,
ReplyDeleteమీ ఉత్సాహం బాగున్నది. ఛందోబద్ధమైన పద్యాలు వ్రాయడం సులభమే. పాఠశాల స్థాయి వ్యాకరణ పుస్తకాల్లో ఛందస్సు వివరించే పాఠం ఉండేది చూసి కొనండి. తేలిగ్గా అర్థం అవుతుంది. మీరు చక్కటి పద్యాలు వ్రాసి సంతోషపడి మమ్మల్నీ సంతోష పెట్టండి.
నమస్తే లక్ష్మీదేవిగారు,
ReplyDeleteనా బ్లాగులోకి విచ్చేసి,తగు సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతలు,ఉత్తేజపరిచే మీమాటలతో నాలో ఉత్సాహం రెట్టింపయ్యింది,మీ సూచనప్రకారం చందస్సు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను.త్వరలో కొన్ని పద్యాలు పెడతాను,అవి చూసి మీ అభిప్రాయం తెలుపగలరని ఆశిస్తాను..ధన్యవాదాలు...