పద్య రచన మీద ఆసక్తితో
కొన్ని వ్రాసాను కానీ ,.వాటిని కాస్త అయినా
చందోబద్దంగా వ్రాసానా ?..లేదా?... అన్న సందేహం ..అదుగో
...అలాంటి సమయంలోనే శ్రీ కంది శంకరయ్య గురువుగారు నిర్వహిస్తున్న శంకరాభరణం బ్లాగు
చూడటం జరిగింది, అదో కవి సంగమం,ఎంతోమంది కవివరేణ్యులు
ఫద్యాలను అలవోకగా పండిస్తూ,గురువుగారి ఆధ్వర్యంలో ఇంకా మెరుగులు దిద్దుకుంటూ , పసందైన పద్యరచనలు, ముగ్ధులుని చేసే పూరణలతో
శోభాయమానంగా, రాగ రత్న మాలికా తరళము ఆ
శంకరాభరణమల్లే వుంది ఆ బ్లాగు...నేను కూడా అందులో ఇచ్చే అంశాలతో పద్యరచన చేయడానికి
సాహసించాను..నన్ను ప్రోత్సహించి , నేను వ్రాసిన పద్యాలను సవరణ చేసి వ్రాయగలనన్న నమ్మకాన్ని నాలో
కల్గించిన గురువర్యులైన శ్రీ కంది శంకరయ్య గారికి నమస్సుమాంజలి ఘటిస్తూ..
వారి సవరణలతో నేను వ్రాసిన పద్యాలు ఇవి...
కసురు కొనుచును కాలమే కాటువేసె
పసరు మందైన పూయ రెవ్వారలైన
ఎసరు పెట్టగ కానరారెవ్వరిచట
పట్టెను ముసురు ముదుసలి బ్రతుకునందు
ఆకలేమొ నేర్పు అవనిలో పాఠాలు
సృష్టి వస్తువెల్ల సూటి గురువు
ఓర్పు నేర్పు యున్న ఓటమే యుండునా
మేక యైన నేమి కేక కేక
సృష్టి వస్తువెల్ల సూటి గురువు
ఓర్పు నేర్పు యున్న ఓటమే యుండునా
మేక యైన నేమి కేక కేక
లాగి నవ్వు తెచ్చి లాఫింగుధెరఫీగ
యోగ యనుచు రోగి యోగి ఆయె
వికటకవిని బోలు నొక విదూషకు డేడి
విశ్వమందు నవ్వు విగతజీవి
యోగ యనుచు రోగి యోగి ఆయె
వికటకవిని బోలు నొక విదూషకు డేడి
విశ్వమందు నవ్వు విగతజీవి
అత్త మామ తోడ , అందరకును స్వస్తి
ఆస్తి యొకటి తప్ప యన్ని నాస్తి
జీన్స్ ఫేంట్ డ్రస్సు,, స్విసు బేంకు బేలన్స్
కొత్త కాపురాల కోర్కెలంట.
ఆస్తి యొకటి తప్ప యన్ని నాస్తి
జీన్స్ ఫేంట్ డ్రస్సు,, స్విసు బేంకు బేలన్స్
కొత్త కాపురాల కోర్కెలంట.
నరకమున సుఖమ్ము దొరకు నయ్య!
నరకభాధలన్ని నెరవుగా ఇక్కడే
రోజుకొక్క తీరు రాజు చుండె
ఇహము లోన సౌఖ్యమింతైన లేదయ
నరకమున సుఖము దొరకునయ్య
రోజుకొక్క తీరు రాజు చుండె
ఇహము లోన సౌఖ్యమింతైన లేదయ
నరకమున సుఖము దొరకునయ్య
మదిని ముసురు కొన్న ముదుసలి పై జాలి
ReplyDeleteమంజుల తెలుగు పద మాల గట్టి
లాయరమ్మ పద్య రామణీయక మొప్పె ,
చాల సంత సమ్ము శైలజమ్మ !
----- బ్లాగు: సుజన-సృజన
నా భ్లాగుకి విచ్చేసి ,తమ సంతసాన్ని చక్కని పదబంధనతో తెలియజేసినందుకు,చాలా,చాలా కృతజ్ఞతలు...మీ బ్లాగు చూసాను..చాలా బాగున్నాయండి ,అందులో బ్రతుకుబండి మరీ నచ్చింది..
Deleteపురోగతి బాగా ఉన్నది . అక్కడే గురువు ప్రాధాన్యత కొట్టవచ్చినట్లు కనపడ్తుంది .
ReplyDeleteపద్యం ద్వారా చక్కటి భావాన్ని అందించారు .
నర లోకమున నరకమే తగులు
నరకమున సుఖమే కలుగు నని .
భేష్ , భేష్ . ముందుకు సాగిపోవటం కాదు , దూసుకుపోవటం చాలా చాలా మంచిది
నమస్తే సర్..
ReplyDeleteమీ ప్రశంశకి చాలా సంతోషించాను..గురువర్యులు శ్రీ కంది శంకరయ్యగారిప్రోత్యాహం,సూచనలు,మీ వంటివారి ఆశీస్సులతో .నాకెంతో ఇష్టమైన పద్యరచన ఇంకా హృద్యంగా వ్రాయగల నైపుణ్యత రావాలని కోరుకుంటున్నా ..ధన్యవాదాలు..