Wednesday, July 3, 2013

వేసవి కవిత...





(  సాహిత్య వెన్నెలలు జాలువారి, ఓలలాడించే   ' కౌముది'  అంతర్జాల పత్రికలో  ఏప్ర్ల్లెల్  నెలలో  ప్రచురించబడిన నా  కవిత...వేసవి వచ్చేసింది.ప్రచురించిన శ్రీ కిరణ్ ప్రభగారికి , కృతజ్ఞతాభివందనాలు ....)

వేసవి వచ్చేసింది...
        ఎలకోయిల రావాలను..
        ఎండల కరవాలాలను..
తీసుకుని తోసుకుంటూ..
మండు వేసవి వచ్చేసింది..
        మామిడి రసాలను..
        మరుమల్లెల తావులను
పట్టుకుని నెట్టుకుంటూ..
మండు వేసవి వచ్చేసింది..
        ముంజెల ముత్యాలను..
        ముచ్చెమటల దాహాలను..
దోసిలి లో నింపుకుని..
వగరుస్తూ..వేసవి వచ్చేసింది..
        వడగాలుల లీలలను..
        వాసంతపు హేలలను..
వడినిండా పోసుకుని..
వేసవి వచ్చేసింది..
        శ్రీకారపు ఉగాదిని..
        శ్రీరామ నవమినీ..
శీఘ్రంగా తోడ్కొని..
వేసవి వచ్చేసింది..
మళ్శీ. వేసవి వచ్చేసింది..


        

8 comments:

  1. బాగుందండి మీ కవిత.....మరి వర్షాకాలం వచ్చెసిందిగా, మరో కవిత రాయండి :)

    ReplyDelete
    Replies
    1. ముందుగా నా బ్లాగులోకి విచ్చేసినందుకు కృజజ్ఞతలండీ..మీ రన్నది నిజమే హర్షానిచ్చే వర్షం మీద కవిత రాయకపోతే ఎలా..once again thank u very much...

      Delete
  2. బాగుంది మీ కవిత

    ReplyDelete
  3. Thank u very Much padmarpitagaru...

    ReplyDelete
  4. నమస్తే లోకేష్ శ్రీకాంత్ గారు..కృతజ్ఞతలు...

    ReplyDelete