మనకి దగ్గరలో వున్న అందమైన
ప్రదేశాన్ని ఇంత వరకూ చూడలేదా !!.....అని అన్పించింది...
అందమైన ఎంట్రన్స్...అంతకంటే అద్భుతమైన బీచ్ రోడ్,ఎందరో మహానుభావుల శిలా
విగ్రహాలు,... చూపరుల మనసు కట్టిపడేసేటట్లు బంగారపు రంగులో లో మెరిసే భారతమాతా
నిలువెత్తు విగ్రహం,..ఆహ్లాదకరంగా రంగురంగుల లైట్లతో, ఫౌంటెన్స్ తో విలసిల్లే ఉద్యానవనాలు...ప్రశాంతసంద్రంలో
పడవలు..కళాత్మకత రూపుదిద్దుకున్న సుందర గృహాలు...చక్కగా కన్పించే వీధుల పేర్లు, సుందరంగా
వున్న రహదార్లు ..వెరసి యానాం ..నయనానందకరం...
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ... యానాంకి పది కిలోమీటర్ల దూరంలో వున్న మడ అడవుల అందం
మరొక ఎత్తు,..గోదావరి సాగరంలో కలిసే ప్రదేశం వరకూ బోటింగ్ చేయడం అందమైన అనుభవం..ఓ
అద్భుతం...నీటిలో తేలియాడే పెద్ద వృక్షాలు...తెల్లటి కొంగలు..అందమైన పక్షులతో
అలరారే కోరింగ అభయారణ్య సందర్సనం...అపూర్వం..అనిర్వచనీయమైన ఆనందం...
మండువేసవిలో ..మలయసమీరం..".మడ అడవుల దర్శనం"
నిజంగా నయనానందకరమే.
ReplyDeleteనా బ్లాగుని చూసి తమ అబిప్రాయాన్ని తెలియచేసినందుకు దన్యవాదాలు....
Deleteనమస్తే సౌమ్యగారు....
ReplyDeleteమీరూ విజయనగరమేనని తెలిసి చాలా సంతోషించాను...అలాగే..మీ బ్లాగ్ చూసాను..మీ సంగీత సాధన ఆర్టికల్ చాలా బాగుంది..మా వూరి ,sorry, మనవూరి...సంగీతకాలేజ్ ఫొటోస్ బాగున్నాయి....నా బ్లాగు చూసి,మీగురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు..మళ్ళీ మాట్లాడుకుందాం...