సిరులు పొంగే జీవగడ్డే
కరవు బారెను పడెనురా
ఆదరించి అన్నపూర్ణే
దేవిరించెను నేడురా….
అన్నదమ్ముల మెలగు జాతుల
వింత కలహములొచ్చెరా
ఉమ్మడి కుటుంబాలూడి
ఊరుమ్మడి బ్రతుకులాయెరా
(ఉండి
లేనట్టాయెరా).....
తెలుగుప్రజలకు తెగులులొచ్చి
తెగలు, తెగలై పోయెరా
పొరుగు పచ్చను ఓర్వలేక
పొగిలి ,పొగిలి ఏడ్చెరా…..
వృధ్ధశరణాలయాలు చూస్తే
అర్ధమవ్వద లోకరీతి……
‘అర్ధ’ మే పరమార్ధమాయె
వ్యర్ధజీవితం ,నిరర్ధకం…..
అన్నీ అక్షర సత్యాలే , నిత్యం కళ్ళ ముందు కదలాడుతున్నవే . చాలా బాగుంది .
ReplyDelete