“శ్రీ శ్రీ మహాప్రస్తానం” లో మరో ప్రపంచంవైపు
పరుగులు తీయునపుడు,.. “కృష్ణశాస్త్రి” వూర్వశి తో వూసులాడి, కృష్ణపక్షంలో మునిగినపుడు, నండూరి “ఎంకి” జాణతనంలో
సేదతీరినపుడు.. నాకూ కవిత్వం వ్రాయాలనిపించింది...అప్పటికే చిన్నచిన్నగా లిఖించే
నా కలం వురవడిని, వడిని అందుకుంది..క్రమక్రమంగా కవనం ఓ వ్యసనం గా,మారింది..
ఏ మంచిపాట విన్నా
..ఆ ట్యూన్ కి, సరిపడే మరో బావాన్ని,కలం ఒలికించేది...ఎన్నో పేరడీలు ..మరెన్నో
పాటలు.....”
కవనానికి బానిసనై
కవనానికి బానిసనై
గమనానికి ఆశను నేనై
వేశానొక వారధిని
నాకు నేనె రధసారధినై”...
ఆ పేరడీల నేపధ్యంలో....మా విజయనగరంపై ..నేను రాసిన పేరడీ ఇది...సంగీత,
సాహిత్య, సాంప్రదాయాలకు పుట్టినిల్లు మా విజయనగరం....ఎందరో మహానుభావులు నడయాడిన
ఒడి...మా వూరి సవ్వడి...ఆ సవ్వడులను మీకు కూడా వినిపించాలని ....ఈ నా పాట.....
వహవా..యిదే విజయానగరము..
నమహో సదా యిదె వందనం
మది మావూరి ఆకృతినె పలికెను ...వినుమరి ........వహవా.....
1. “గురజాడ” నడిచిన వాడ
“ఆదిభట్ల” హరికధ జాడ..
మాయునా..ఏనాటికీ..
ఆ “ద్వారం”... సరిగమ సారం....
“ఆనందుడే” ఏలిన రాజ్యం…….మారునా....
పరువుకే ప్రాణమిస్తుంది
నగరము...
ఎంతకూ ఒటమే లేని పంతము...
బ్రతుకు పన్నీటి గంధము..
శాంతినే కోరు నందనం..
కలసిన మనసులు..
కరములు కలిపిన
కమ్మని వేళల
జిలిబిలి పలుకుల ...... కిలకిల
నెలవులలో..... వహవా...
2.
“ఘంటశాల” కట్టిన పాట
“గానకోకిల” పుట్టిన చోట……. గాలిలో......సంగీతమే.....
“ఆంధ్రాలో జాలరి” వేట
ఆ “కుమ్మరి కధ” ప్రతినోట… నేటికీ....
సంస్కృతి సాంప్రదాయాల సంగమం...
రాజకీయాల సౌరభం....
చెరగని చారిత్ర వైభవం...తెలుసుకోరా....
కధలకు నెలవిది...
అతిధుల కొలువిది...
మధురపు హృది యిది.....
మమతల పొదయిది...”విద్యలనగరపు” నగవులలో... వహవా......
3.
“కన్యాశుల్కమే” విన్నా,
“సర్ విజ్జి” క్రీడను కన్నా.... తల్లి..ఈనేలరా...
“పైడమ్మ” చల్లని మహిమా....
“సిరిమాను” జాతర గరిమా... చూడరా....
వినుమరీ.... “కోడిరామ్మూర్తి” రీతిని...
“అభినవ భీముని” కీర్తినీ...
ఆ “గజపతిరాజు”ల ఖ్యాతినీ...... తెలుసుకోరా....
జయజయ ధ్వనముల
స్వరపద మనముల
నినదించే తావుల
కదిలించే ప్రియ మధుకర రవముల లాహిరిలో........ వహవా......
ఈ పాట దేని పేరడీనో........చెప్పాలంటారా???????
No comments:
Post a Comment