“ఎంత
మేధ మధిస్తేనో..
ఒక్క కవితాలత కుసుమించేది” ..?
“భావనాస్ఫోరకమైన
భావమొక్కటియున్న
బహుకావ్యమాలికల పూలు విరజిమ్మవా
స్ఫూర్తినిచ్చేఒక్క మూర్తిత్వమే వున్న
స్ఫురియించవా వరదలా పదములే”..
ఏ కళాకారుడికైనా తన బావానికి
జీవంపోయడం ..ఓ మాతృమూర్తి ప్రసవనేదనతో సమానం...బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం తల్లి
ఎంత అనుభనవిస్తుందో ..అంతే ఆనందానుభూతి.. ప్రతీ కళాకారునికి కలుగుతుంది...
“పేపరు, పెన్ను,లేదా
కీబోర్డు వుంటే చాలు కవిత్వం,కధలూ రాసెయ్యవచ్చు”అనే అబిప్రాయం ..
కొంతమంది అనగా విన్నాను......ఓ పాటలో అనుకుంటా ఇలా వుంది...”భావాలు పదునెక్కి ,..బాష
ఎరుపెక్కాలి...అక్షరాలలో అగ్ని విరజిమ్మాలి,”అని......భావాలు పదునెక్కితే భాష ఎరుపెక్కడమే కాదు
,ఎదలోతులను సైతం కదిలిస్తుంది, అగ్నితోపాటు,అమృతాన్ని కూడా కురిపిస్తుంది..
ఏమంటారు....?నిజమా...కాదా...!!.......
.......... కవిత్వం లోక సాదృశ్యం...........
కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమలను బహిర్గతం చేయాలి అగ్ని కురిసినా అమృతం చిలికినా అందం ఆనందం దాని పరమావధి ....అన్నాడు ఆనాడు తిలక్ .స్పందించి గుండెలో కలం ముంచి కవి కవనం లిఖిస్తాడు ,అంతర్మధనపడతాడు గింజుకుంటాడు వుర్రూతలూగుతాడు.
ReplyDeleteనా బ్లాగుని వీక్షించి..తిలక్ స్పందనను..మీ స్పందనను తెలియచేసినందుకు నమస్సుమాంజలి....
Deleteమీరన్నది నిజమే.
ReplyDeleteThank u padmarpitagaru...
Deleteనిజం చెప్పారు
ReplyDeleteThank u Muraligaru..మీ మురళీగానం చూసాను ..మీ introduction బాగుంది..అలాగే మీరు వ్రాసిన పాటలు (కోయిలమ్మ..నీడల్లె..) చాలా బాగున్నాయి..
ReplyDelete