వర్షం ..వర్షం.. ఎంత
హర్షం...మండే ఎండలమధ్యన ఒక్కసారిగా మంచు పూల వర్షం..మావైపు గోళీల సైజులో వడగళ్ళ
వర్షం పడింది..జూన్ లో పడాల్సిన వర్షాలు యిప్పడు పడుతున్నాయని ..యీ అకాల వర్షాలు
మంచివి కావని యిప్పుడే న్యూస్ విన్నా...
ఏది ఏమైనా ..కర్షకులకి
యీ వర్షం ఎంత మాత్రం హర్షం కాదు...
ఓ పక్క గ్లోబల్
వార్నింగ్.. మరోపక్క రాను రానూ
పెరుగుతున్నపొల్యూషన్...ఇంకోవంక.. భూప్రకంపనలతో వణికిపోతున్న దేశాలు..మొన్నటివరకూ
యుగాంతం ..ప్రజలని భీతావహులని చేసి వదిలింది..ఇక పైని చూద్దామంటే.. ఎప్పడు ఏ గ్రహ శకలం వచ్చి పడుతుందో అన్న భయం..ఇక
కిందన చూస్తే పచ్చదనం మచ్చుకైనా కనిపించదే..
విజ్ఞానం
పెరుగుతున్నకొద్దీ మన వినాశనం మనమే కొని
తెచ్చుకొంటున్నామా..!!!!!!ఇన్ని భయాలు పక్కన పెట్టుకుని నిర్భయంగా ఎలా వుండగలం...????ఎలాగో వుందామన్నా..”నిర్భయ” లాంటి కేసులు
ప్రతీరోజూ కోకొల్లలు...భాధ.. నరాల్ని మెలితిప్పే భాధ.. ఏమీ చేయలేని నిస్సహాయత.. వేదన
..మనసున్న ప్రతీ ఒక్కరికీ వేదనే ....రోదనే...అరణ్యరోదనే..
మనసులను మండించు
వేదనా ఆగవే ..
దేనికోసం నీవు
పరుగుపెడుతున్నావు...
వ్యధాభరిత
శిధిలహృదయం కోసమా... ఏమో మీకైనా తెలుసా....
అక్షరాలు
అశ్రువులై...రాలుతున్నాయి...
బావాలు
భాధగా....గాయంచేస్తున్నాయి
గాయాలు గేయాలై
గొంతుదాటి రాకున్నాయి..
గద్గదమైనది
స్వరము...
నిజమే....ఏంటో ఈ అకాలవర్షం!
ReplyDelete
ReplyDeleteఈ అకాల వర్షాలు ఒకింత సేద తీరుస్తాయే గాని , మరింత దుఃఖాన్ని మిగులుస్తున్నాయి .
బాగుంది ఈ అకాల వర్షపు కవిత .
నిజం .ఈఅకాలవరాషలతో పల్లెటూరి లోనూ బాధ లే నగరం లోనూ .కష్టమే . చాలా బాగా రాశారు .
ReplyDeleteThank U ...
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteనా ఆలోచనల అక్షరాలకు..
Deleteతమ అమూల్య స్పందనతో...
ఊపిరి పోసినందుకు....
నమస్సుమాంజలులు..
విజయనగరంలో వడగల్ల వానంట కదండీ.
ReplyDelete