ఎక్కడికెళుతోంది
..?దేశం ఏమైపోతోంది...?దిక్కులు దాటిన చక్కని
సంస్కృతి..దిక్కూ,మొక్కూ లేని ప్రకృతి....
పరాయిదేశంవారిని సైతం ..మురిపించిన మన జాతి
సంస్కృతి ,పతమనవుతోంది..దీనికి లేదా నిష్కృతి..
“నడుమ బట్ట కడితే నగుబాటు
నాగరీకం
ముదిరితే గ్రహపాటు..”
అని ఓ పాత పాట
వుంది.. అలా...నాగరికత పెరిగిన కొద్దీ
ఉచ్ఛం,.. నీచం, మరచిన ప్రవర్తన ..విదేశాల సంస్కృతి దిగుమతి,..అంతకంతకూ వెర్రితలలు
వేస్తున్న ఫ్యాషన్స్...పబ్ కల్చర్,...కట్టే బట్టలు కూడా
బరువయిపోతున్నాయేమో...లోదుస్తులు పైన వేసుకుని తిరిగే సత్ సంప్రదాయం....ఆడయినా ,
మగయినా ,..ఈక్వల్ రైట్స్ కదా... అన్నింట్లో.. మరి మద్యంలో ఎందుకుండకూడదు..మజ్జిగ తాగినంత
హాయిగా తాగే యడం వాగేయడం....
హై క్లాస్,..లో
క్లాస్,..మిడిల్ క్లాస్,..ఏ క్లాసు చూసినా ...ఎంత చెట్టుకి,.అంతగాలి ..ఇదేనా
అభివృధ్ధి...?విదేశస్తులు
సైతం , మన కట్టు ,బొట్టుని , ముచ్చటపడి అనుకరిస్తుంటే,..మనమేమొ ,మన సంస్కృతిని
మనమే దిగజార్చుకుంటున్నాం..ఇందులో తల్లితండ్రుల పాత్ర ఎంతవరకుంది..?పిల్లలని పట్టించుకోని
తలితండ్రులదా...?వారి
మాటలు వినని పిల్లలదా...?ఏమో.!
అమ్మాయిల అందం అతి కురచ
బట్టలులోనే వుందా?...నిండుగా
వున్న డ్రస్ లో వుండదా?...నాగరికత అని దీనినే
అంటారా...పచ్చని పల్లెసీమలని కూడా కలుషితం చేస్తోంది ఈ జాడ్జ్యం,
ఇలాంటి..... అభివృధ్ధికర వాతావరణంలో ..అరాచకాలు,
విధ్వంసాలు కాక ఇంకేమొస్తాయి...ఎంతో వున్నతమైన మన సంసృతి ,సంప్రదాయాలు,
కట్టుబాట్లకి విలువనిచ్చి, ఆచరించే విధంగా పిల్లలని పెద్దలు సరిదిద్దాలి,...
నాగరికంగా వుండడంలో
తప్పులేదు... అనాగరికంగా ప్రవర్తించడం తప్పు...
బాగాచెప్పారు.
ReplyDelete