కళ్ళుంటే చూసి
వాక్కుంటే వ్రాసీ
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరనిదాహం
అన్నారు మహాకవి శ్రీ శ్రీ .. అలాగే..”కుక్కపిల్లా,..అగ్గిపుల్లా,...సబ్బుబిళ్ళా,..తలుపుగొళ్ళెం,..హారతిపళ్ళెం,..హీనంగా
చూడకు దేన్నీ,..కవితామయమేనోయ్ అన్నీ” .......అని కూడా అన్నారు...నిజమే కదా..”కళ్ళకి మనసు,..మనసుకి
కళ్ళు వుంటే”...
కవితావస్తువు కానిదేముంది?....కవితలు వ్రాస్తున్న తొలిరోజుల్లో..శ్రీ శ్రీ
మహాప్రస్థానం ప్రబావం నామీద చాలా వుండేది...ఆ మహాకవికి వున్నఅనేకమంది ఏకలవ్యశిష్యుల్లో..
నేను కూడా వున్నాను...
అందుకే ..ఏ రసనిర్దేశం లేని
వాటిపై..కవితలు వ్రాయాలని....ఇలా కొన్ని...
హారతిపళ్ళెం…..
గుళ్లో హారతి పెట్టాలన్నా
కాసులుబాగా పట్టాలన్నా
కొత్తకోడలు వచ్చిందన్నా
బారసాలలు చేయాలన్నా
చెల్లెలు రాఖీ కట్టాలన్నా
చిల్లరపైసలురాలాలన్నా
వేడుకలన్నీ జరగాలన్నా
వాడుక మనకీ హారతిపళ్ళెం…….
తలుపుకి గొళ్ళెం….
మనుషుల్ని.. దండించాలన్నా
మనసుల్ని.. బంధించాలన్నా
మమతల్ని.. ఖతం చేయాలన్నా
మమకారాలపై.. కారం చల్లాలన్నా
మాటల్ని ..మాటున వుంచాలన్నా
మూటల్ని.. పదిలపరచాలన్నా
కావాలి తలుపుకి గొళ్ళెం……
మీ కవితలు చాలా చాలా బాగున్నాయ్.
ReplyDelete- ప్రవీణ్
http://sathyagrahee.blogspot.in/2010/05/blog-post_18.html