Saturday, April 20, 2013

బాల్యమా.... భారమా...




                       టైమ్.... అప్పడే తొమ్మిది కావస్తోంది...ఎటెండ్ కావాల్సిన  కేసులు చాలా వున్నాయి...తొందరగా వెళ్ళాలి...పని చూస్తే ఇంకా తెమలటంలేదు..సరిగ్గా అప్పడే ట్రింగ్..ట్రింగ్.. అంటూ ఫోన్...లిఫ్టు చేయగానే అటునుంచి  నా స్నేహితురాలు మంగళ   తిట్ల దండకం..మరీ  ఎంత లాయర్ వైనా వస్తానని చెప్పి ఎన్నాళ్ళైంది...అలా దాటేస్తున్నావు..నువ్వు వస్తేనే గానీ  నేను రాను ..అని బెదిరింపు..ఇంక ఆపవే తల్లీ..ఈ రోజు ఎలాగైనా వచ్చి తీరతాను సరేనా...ముందు ఫోన్ పెట్టెయ్..అంటూ వాల్ క్లాక్ చూస్తూ పరిగెట్టాను..

                       సాయంకాలం ఇంటికి వస్తుండగా గుర్తొచ్చింది..నే చేసిన వాగ్దానం.. తీరా చూస్తే చాలా దూరం  వచ్చేశాను...తప్పదు..వెళ్ళాల్సిందే అనుకుంటూ కారుని బేక్ చేసి..  మంగళ ఇంటివైపు పోనిచ్చాను...

              నన్నుచూడగానే ఆనందంతో ..ఏం తల్లీ ఇప్పటికైనా తీరిందా !” అంటూ ఎదురొచ్చింది.. ఏం చేస్తాను.. ఈ సాయంత్రం నీకిలా బుక్ అయ్యాను ..కానీ..అంటూ హాల్లో సోఫాలో బేగ్ పడేసి... కూర్చున్నా..అపుడే చూసా... ఒకామె అక్కడ వుండటం..ఇంతలో....మా మంగళ......ఇదేనండీ నే చెప్తుంటానుగా..... నా బాల్యస్నేహితురాలు శైలజ..మంచి లాయర్.....అని ఆవిడకి నన్ను పరిచయం చేసి ..శైలూ..ఈవిడ మా కొలీగ్ హరిత...అని పరస్పరం పరిచయం చేసింది...అలా కబుర్లతో ఓ పావుగంట గడిచాక..హరిత వస్తానని లేచారు..మా పాపని మ్యూజిక్ క్లాసుకి తీసుకెళ్ళాలి ..లేకుంటే ఇంకాసేపుందును మాటల్లో టైమ్ చూడలేదు అంటూ హడావిడిపడుతూ లేచారు.. ..

                  వావ్!!..నైస్....మ్యూజిక్ నేర్పిస్తున్నారా? ..ఎంతవరకు వచ్చింది?” ..అని సంగీతం పట్ల నా కున్న ఇష్టంతో అడిగాను..

                టి వి ఛానల్స్ పోటీలకి పంపించడానికి తయారు చేస్తున్నామండీ...అన్నారావిడ..ఎంతో సంబరంగా...

                ఓహ్ అలాగా..పాపకి ఎన్నేళ్ళు?”..

                మా శ్రావ్యకి  మూడేళ్లు వచ్చాయండీ..అని చెప్పి.... హరిత కంగారుపడుతూ.. మళ్ళీ కలుద్దామండీ.... అని ఆదరా బాదరాగా బయలుదేరారు....

             ఆవిడని పంపించి వచ్చి మంగళ నా ప్రక్కన కూర్చొని ..ఆ..ఏంటి చెప్పు కబుర్లు....ఉండు తినడానికేమైనా తీసుకువస్తాను...అంటూ కిచెన్లోకి వెళ్లింది...

          అప్పటికే నా ఆలోచనలు చిన్న చిన్న పిల్లలు ...పాటలపోటీలు ..చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.........................

              .ఛానల్స్ లో చిన్న  పిల్లలు పాడటం..గెలవటం ఓడటం..ఇవన్నీ చూస్తునపుడు..ఇప్పటి జనరేషను పిల్లలు తమ బాల్యాన్ని పోగోట్టుకుంటున్నారనిపిస్తోంది..బండెడు పుస్తకాల బరువు ఒకవైపు..మరోవైపు ..ఒకరిని చూసి ఒకరు..... వారి పిల్లలు కూడా అలాగే కావాలని..వారి వయసుకి మించిన భారాన్ని వారిపై నెట్టేస్తున్న పెద్దలు......హాయిగా ఏ చీకూ చింతా లేకుండా ఆడుకోవాల్సిన వారిపై తలకు మించిన బారాన్ని మోపడం..తీరా అవకాశమొచ్చీ స్టేజి ఎక్కాక .మాస్ మసాలా పాటలు.. ప్రేమ పాటలు  పాడించటం....మసక మసక చీకట్లో ....లాంటి పాటలు వాళ్లచే పాడిస్తే ఎంత అసహ్యంగా, అసహజంగా వుంటుందో ఎందుకు తలితండ్రులకి అర్ధం కావట్లేదో!!!.....ఆ పసి మనసులకి ఆపాటల  అర్ధాలు ఏంతెలుస్తాయి?...... ఓడినపుడు వా ళ్ళు పడే  బాధ వర్ణనాతీతం.....

            ఎలిమినేషన్  సమయంలో ఆ చిన్ని హృదయాలు ఎంత వేదన అనుభవిస్తున్నాయో!.... ఇవన్నీ వారి వయసుని ఎంతగా ప్రబావితం చేస్తున్నాయి..డాన్స్ కాంపిటీషన్స్ కూడా ఇదే మూసలో  సాగుతున్నాయి..... చిన్నారి బాల్యాన్ని ,బారంగా మార్చి, ఏమార్చే, ..ఇలాంటి పోటీలవల్ల వచ్చే పేరు ,డబ్బుకి పెద్దలు ఆశించకుండా దయచేసి ..బాల్యాన్ని.... బాల్యంగా బతకనీయండి.....

                 అందమైనది..తిరిగి రానిది బాల్యం..ప్రతీవారి జీవితంలో ఓ మధుర స్మతిగా మిగలాలి గానీ ........అపశ్రుతి గా మారకూడదు...కాదంటారా????!!!!!!!!..

3 comments:

  1. శైలజ గారూ ,

    ఈ చిన్నపిల్లల పాటల పోటీలతో ,వాళ్ళ బాల్యం శల్యమై చితికిపోతుంది . నిజమే ,
    వాళ్ళకు ఆ పాటల అర్ధాలు తెలిస్తే , వాళ్ళ మనుగడా మసి పూయించుకున్న మారేడుకాయ అయిపోతుంది .

    ReplyDelete
  2. నిజమే కొన్ని అనుభూతులు వాళ్ళకి అందలేదని బాధ కొన్ని ఎక్కువై అన్నీ కోల్పొతున్నారని బాధ. తల్లితండ్రులకు లేనివి ఇప్పటివారికి అందుబాటులో వున్నాయని సంతోషించాలో దుఖించాలో అర్థం కావడం లేదు.

    ReplyDelete
  3. నమస్తే.. ఇప్పుడే నరసింహం గారిని కలిసాను

    ReplyDelete