Thursday, October 24, 2013

శంకరాభరణం..పూరణ(మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్),పద్యరచన(జాతిపిత)



శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....
సమస్యా పూరణ...మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్...

గడగడ వణికెడు తండ్రికి
పడిపోయినపల్సుజూడపరుగున బోయెన్
కొడుకులు మందని యివ్వగ
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్



పద్యరచన..జాతిపిత..
 
కళ్ళ జోడుతో నడచిన కాంతి మూర్తి
సత్యము నహింసలను చాటె సమర యోధ్ధ
తెల్ల దొరలను తరిమిన దేశ భక్తి

న్మ దినమున జేజేలు జాతిపితకు
మత్తకోకిల......


బోసినవ్వుల గాంధితాతయె పోరుసల్పెను నాడురా
బాసకోసము అన్నదమ్ముల బంతులాటలు చూడరా
దేశమన్నది జాతినేతయె దేవళమ్మని చాటెరా
మూసపోసిన మానవత్వము మచ్చుకైనను లేదురా
 

No comments:

Post a Comment