మహాగౌరి(దుర్గ)
చందమామను బోలుమోముతొ చక్కనైనది శాంభవి
చందనమ్ములు జాలువారెడి చారులోచని భైరవీ
నందివాహిని సర్వమోహిని నాగభూషణ శాంకరీ
వందనమ్ములు తల్లిగౌరికి వందనమ్ములు భార్గవి
నవరాత్రులు ఎనిమిదవ రోజున దేవి మహాగౌరి రూపాన దర్శనమిత్తును,ధవళవస్త్రధారిణియైన ఈమెను బూజించగపాపములు పూర్తిగా సమసిపోవును..నైవేద్యం గా చక్కెర పొంగలి నివేదిస్తారు
మత్తకోకిల:
చందమామను బోలుమోముతొ చక్కనైనది శాంభవి
చందనమ్ములు జాలువారెడి చారులోచని భైరవీ
నందివాహిని సర్వమోహిని నాగభూషణ శాంకరీ
వందనమ్ములు తల్లిగౌరికి వందనమ్ములు భార్గవి
No comments:
Post a Comment