Tuesday, October 22, 2013

విజయనగర పైడితల్లమ్మ సిరిమాను సంబరం


మా విజయనగరంలో ఈ రోజు పైడితల్లమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.  అశేషజనవాహినిలో అమ్మవారు "సిరిమాను" పై అధిరోహించి నగరంలోని ప్రధానవీధుల ఊరేగి జనులను ఆశీర్వదిస్తారు.
"సిరిమాను" ముందు అంబారికి గురుతుగా అలనాటి గజపతుల కు సింబాలిక్ గా "ఐరావతం" అని పిలిచే ఈ రధాన్ని నడుపుతారు.



పైడితల్లమ్మ విజయనగరం లో గల పెద్దచెరువు నందు బెస్తవారికి విగ్రహరూపంలో లభ్యమయ్యారని చరిత్రకారుల కధనం. వారికి గురుతుగా బెస్తల జాలరి వల అమ్మవారి ఊరేగింపులో "సిరిమాను" ముందుంటుంది.

ముత్తయిదువులు పసుపు కుంకుమలు తీసుకొస్తున్న గురుతుగా "అంజలి" రధాన్ని ఊరేగిస్తారు.

గజపతుల గురుతుగా పైదితల్లమ్మకు "పాలధార"ను ఊరేగిస్తారు.



సిరిగల తల్లి " సిరిమాను" పై విజయనగరం లో చదురుగుడి నుండి గజపతుల కోటవరకూ ముమ్మారు ఊరేగి భక్తుల హృదయాలలో ఆనంద ముద్రలను వేస్తారు.  సిరిమాను సంబరానికి ఈప్రాంతంవారే కాక ఒడిషా, చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి కూడా అశేష జనవాహిని తరలి వస్తుంది.  
కొంగు బంగారం, కోరిన కోర్కెల నీడేర్చే కల్పవల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు సదా అందరిపై వర్షించాలని అభిలషిస్తూ....



No comments:

Post a Comment