స్కందమాత(లలిత)
నవరాత్రులలో అయిదవరోజున దేవి స్కందమాత రూపమున దర్శనమిచ్చును, స్కందుని(కుమారస్వామిని)ఒడిలోనుంచి, ఒకచేత పట్టుకుని, ఒక చేతిలో పద్మాన్ని ధరించి,మరి రెండు చేతులలో కమలము , అభయముద్రలతో సింహవాహనముపై ఆశీనురాలై భక్తులను, తరింప జేయును, ఈరూపమున దేవిని ఆరాధించిన భక్తులు పరమసుఖశాంతులు పొందెదరు...

మత్తకోకిల......
బాలస్కందుడు అంకమందున భవ్యరూపిణి భార్గవీ
నీలలోచని నన్నుగావుమ నిత్యశోభిని భైరవీ
భాలచంద్రవు యోగమాయవు పద్మధారిణి బాబ్రవీ
ఫాలనేత్రుని యర్ధదేహిని పాతకంబులు, దీర్చుమా
No comments:
Post a Comment