Monday, October 7, 2013




చంద్రఘంటిక



నవ రాత్రులలో మూడవ రోజున చంద్ర ఘంటిక రూపంతో ఆమ్మ దర్శనమిచ్చును. సింహవాహిని దశభుజములందు అస్త్ర శస్త్రములను ధరించియుండును. ఈదేవిని ఆరాధించిన భక్తుల కష్టములను అతిశీఘ్రముగా నివారించును.


మత్తకోకిల

చంద్రవంకతొ చారులోచని చంద్రఘంటిక వందనమ్
చందమామను బోలుమోమున చంద్రసోదరి వందనమ్
మందహాసము కాంతిదేహము మంజుభాషిణి వందనమ్
అందజేతును సింహవాహిని ఆదిశంకరి వందనమ్.. 



No comments:

Post a Comment