Monday, October 14, 2013

సిధ్ధిధాత్రి(రాజరాజేశ్వరి)

తొమ్మిదవరోజు మాతను సిధ్ధిధాత్రి(మహిషాసుర మర్ధిని) రూపంతో కొలుస్తారు. తల్లిని సేవించిన సకల శుభములు సిధ్ధించును తల్లికి నైవేద్యంగా పాయసాన్నం నివేదిస్తారు.


మత్తకోకిల:

బుధ్ధినిచ్చెడి సిధ్ధిధాత్రికి బూజసేయగ నిత్యమున్
వృద్దిచెందును అష్టసిద్దులు పృధ్విలోనిది సత్యమున్
శుధ్ధిచెందును పాపకర్మలు శూలధారిణి నామమున్
సిధ్ధిధాత్రికి దుర్గమాతకు సింహయానకు వందనమ్


No comments:

Post a Comment