Saturday, October 12, 2013

కాళరాత్రి కి వందనం




నవరాత్రులల్లో ఏడవరోజు దేవి కాళరాత్రి రూపంలో దర్శనమిస్తారు. భయంకర ఆకృతిలో నుండు ఈరూపం అమిత శుభముల నిచ్చే వరదాయిని.


కాళరాత్రి(సరస్వతి)

మత్తకోకిల:
కాలకేశిని కాంతిరూపిణి కాళరాత్రికి వందనమ్
నీలదేహిని జ్వాలలోచని  నీలవేణికి  వందనమ్
గాలిగాడియె వాహనమ్ముగ  గాచుదేవికి వందనమ్
మాలధారిణి దైత్యనాశిని  మాతకాళికి వందనమ్





మత్తకోకిల:
ప్రస్తుతించెద  వీణపాణిని ప్రస్తుతించెద వాణినీ
ప్రస్తుతించెద  హంసవాహిని భావసంపద గోరుచున్
ప్రస్తుతించెద  మంజుభాషిణి ప్రస్తుతించెద వాహినీ
ప్రస్తుతించెద నెల్లవేళల బాణియుగ్మము మోడ్చుచున్


చల్లనైనది తల్లిరూపము జాజిమల్లెల సౌరభం
జల్లుచుండును అక్షరమ్ముల జ్ఞానదీపము లెల్లడన్
వెల్లువవ్వగ యాప్రకాశము వెల్గుచుండును విశ్వమున్
బల్లవించగ  తల్లిభారతి ప్రస్తుతించెద సర్వదా





No comments:

Post a Comment