Sunday, October 20, 2013

శంకరాభరణం..పద్యరచన..(గ్రామదేవతలు)సమస్యా.పూరణ( జారుల కృత్యములు మనకు సంతోషమిడున్)

-->
-->శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో......
సమస్యా పూరణ..జారుల కృత్యములు మనకు సంతోషమిడున్...

తూరుపు తెలవారకనే
తీరుగ పూజలు జరుగును తిరుపతి లోనన్
హారతు లీయగ యాపూ
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్
పద్య రచన.....గ్రామ దేవతలు 
గ్రామ దేవత యూరిని కాచు నెపుడు
నీమ నిష్టల బూజించ నిన్ను బ్రోచు
గ్రామ దేవత కొలువున్న గ్రామమందు
నిత్య కల్యాణ ముగనుండు నిక్కముగను



క్షేమము లొసగును దేవత
గ్రామము నందున జనులను కావగ వచ్చున్
నీమము నఉపా రములిడి
నామమ్ము స్మరణమ్ము జేయ జ్ఞానము నిచ్చున్

No comments:

Post a Comment