శైలపుత్రి
నవరాత్రి పర్వదినములలో మొదటిరోజున దేవి శైలపుత్రి నామముతో పిలువబడును, వృషభవాహనమును అధిరోహించి,ఒక చేతన త్రిశూలము,మరియెక చేత కమలము ధరించి,చంద్రవంక శిరసున దాల్చిన దేవి భక్తులను తరింపజేయును,ఈ రోజున కట్టుపొంగలి నైవేద్యము చేయుదురు..
మత్తకోకిల......

వందనమ్ములు ఆదిశక్తికి వందనమ్ములు శాంకరీ
విందుగా హిమవంతునింటను బిందురూపిణి శైలజా
సుందరంబగు శూలధారిణి సృష్టి కారిణి శ్యామలా
వందనమ్ములు యందజేతును వాంఛితాఫల దాయినీ
No comments:
Post a Comment