Friday, September 27, 2013
శంకరాబరమం..(పద్య రచన( దొంగలముఠా) పూరణ(అప్పు లేని వాడె యధముడుగద)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
పద్య రచన...దొంగల ముఠా..
దోచుకొనుచు దిరుగు దొంగలదే ముఠా
దోషు లెవరు యిలను దెొరలు వారె
ప్రజల సొమ్ము దినుచు పదవుల కెక్కిన
వారి నామ మేమి వాయు సుతుడ
సమస్యా పూరణ...అప్పు లేని వాడె యధముడు గద
అప్పు జేయ వచ్చు నాపదలందున
నప్పు లేని దెవరు రవని యందు
నప్పు లేలు చుండె నఖిల జగంబు
నప్పు లేని వాడె యధముడు గద
దేశ మప్పు కొరకు దేవిరించునపుడు
దేశ ప్రజలు పట్టు దేహి దారి
దోస మేమి లేదు దోసిలి పట్టిన
అప్పు లేని వాడె యధముడు గద
అప్పు లేని వాడె యధముడ కదయంచు
పలుక వలదు ప్రజలు ప్రభుత జూడ
అప్పు లేని వారె అన్నింట బెద్దలు
తప్పు లెన్ని యున్న తప్పు కొనును
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment