Wednesday, September 18, 2013

శంకరాభరణం...పద్య రచన..పూరణ..( తులసి కోట, పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్! )



శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో.....
పద్య రచన.....తులసికోట...

 




తులసి కోట దరిన ధూపదీపమ్ముల
హారతీయవలయు అనుదినమ్ము
తులసి యున్నఇంట దురితమ్ముతొలగును
పెంచవలయు తులసి ప్రేమతోడ.

సమస్యా పూరణ..... పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్!


రంజింప బాల్యమందు పు
రంజనుపై భక్తి లేక బ్రతికి చివరకున్
కంజాతనేత్రు దలచిన
పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్!
 

బాల్యమందున దేవతా భక్తిలేక 
యవ్వనమునందు భక్తియె అసలురాక 
పండువయసున భక్తిగని, పంజరమున  
నున్న చిలుక ఫక్కున నవ్వెన్! ఉర్విజూచి

No comments:

Post a Comment