Saturday, September 21, 2013

శంకరాభరణం..పద్య రచన..(ఋణానుబంధము)

 పద్య రచన...ఋణానుబంధము.....

 మత్తకోకిల...

ఇన్నిజన్మల బంధనమ్ములు ఏఋణమ్ముల రూపముల్
అన్నదమ్ములు ఆలుబిడ్డలు అన్నిబంధము లందరున్
అన్నివేళల కన్నవారిని ఆదరమ్మున చూచుచున్
అన్నికర్మలు ఆచరించుచు ఆదిదేవుని గొల్వుమా




తల్లి ఋణము దీర్చ తనయుని ధర్మంబు
భోగ భాగ్య ములను పొందు కన్న
నమ్ము కున్న వారి నట్టేట ముంచని
తనయులున్నవాడె ధన్య జీవి

No comments:

Post a Comment