శంకరాభరణం : పద్యరచన: శివగంగ
శ్రీహరి పదంబులను బుట్టి శ్రీకరమయి
శివ జటాజూటమును జేరి భువిని బ్రోచు
పరమపావనగంగ యీ ప్రళయమేల
ఫాలనేత్రుని శివగంగ ప్రణతులమ్మ
శిరమునన్ గంగ దాల్చిన
శివ! త్రినేత్ర!
ఎదుట గనుమది గంగమ యేమి మాయ
వంక జాబిలి నవ్వెలే వరుసజూసి
మురిసిపోకయ్య లోకేశ ముప్పుగనుమ
No comments:
Post a Comment