శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతలతో..
పద్య రచన...తన్మయత్వము..
సుగంధి.......( ప్రధమ ప్రయత్నం)......
జన్మనిచ్చు తల్లి వంటి జన్మభూమినిన్ గనన్
తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్
జన్మ లెన్ని యెత్తియైన జాతి కీర్తి చాటుచున్
తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్
చిన్మయున్ ముకుందు జూచి చిత్త శాంతి నొందుచున్
తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్
సన్మతిన్ భజించి స్వామి షణ్ముఖున్ నుతించుచున్
తన్మయత్వ మొందరొక్కొ ధన్య లైన తల్లులున్
పూరణ......
బలవంతులైన కపులను
పలువురినెల్లకలుపుకుని పలుకగమేలై
తలపడె నిజముగ వానర
బల రాముడు లంకజేర వారధి గట్టెన్
No comments:
Post a Comment