Saturday, September 21, 2013

శంకరాభరణం..పద్య రచన..( జూదము) పూరణ..(దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్)

 శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....

సమస్యా పూరణ...దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్

అనియెను! ప్రహ్లాదుడు,సఖులు,
దనుజులకొమరులనుబిలచి దానవు లారా!
వినరే ! హరియే దైవము
దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్


 పద్య రచన....జూదము....

 జూదము లాడిన జనులకు
వేదన మిగులును బ్రతుకున వేడుక లేదే
జూదము లాడిన ప్రభువులె
భాధల పాలై ఆడవుల పాలయిరి గదా 

2 comments:

  1. జూదము ఆ వేదననే మిగుల్చునని బహు చక్కగా చెప్పావు .

    ReplyDelete
    Replies
    1. చాలా కృతజ్ఞతలు సర్..

      Delete