శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
పద్య రచన..దోమ..
దోమా! పద్యము వ్రాయగ
లేమా! నీపై! నిదురను లేదే ధీమా
కామా! పెట్టక కుట్టుచు
టీముగ తిరిగిన తమరిని ఢీకొన గలమా
చక్కెర కైనను దొరకవు
చక్కగ ఆలవుటుకసలు జడవవె దోమా.
చుక్కలు చూపుతు జనులకు
చిక్కక తిరిగెదవుగాదె చీయన లేమే
సమస్యా పూరణ...ముట్టుడిగిన (ముట్లు)సతికినొక్క పుత్రుడు పుట్టెన్
పట్టిన నోములు పట్టక
చెట్టును పుట్టను దిరుగుచు చేయగ పూజల్
పట్టిని కోరిన, వరముగ
ముట్టుడిగిన సతికి నొక్కపుత్రుడు పుట్టెన్
ఎట్లో నోములు నోచియు
చెట్లను పుట్టలను దిరుగి శ్రీ తిరుమలపై
మెట్లకు మ్రొక్కగ, వరముగ
ముట్లుడిగిన సతికి నొక్కపుత్రుడు పుట్టెన్.
No comments:
Post a Comment