Saturday, September 21, 2013

శంకరాభరణం...పద్య రచన.(కాలుష్యము) పూరణ...(పుస్తకములజదువువాని బుద్ధి నశించున్ )


పద్య రచన..కాలుష్యము...

కాలుష్యములన్నియునూ
కాలము మనసును తనువుల కబళించంగన్
గోలగు కర్కశ శబ్దపు
కాలుష్యముతో బ్రతుకులుగాడిని తప్పెన్


 సమస్యా పూరణ....పుస్తకములజదువువాని బుద్ధి నశించున్

పుస్తకములు జదివినచో
స్వస్తి నొసగును మనసుకి స్వాంతనగల్గున్
మస్తకము ప్రకోపించే
పుస్తకములజదువువాని బుద్ధి నశించున్

No comments:

Post a Comment