Friday, September 20, 2013

శంకరాభరణం..పద్య రచన ( జోలపాట) పూరణ..( తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి)



శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....
 పద్య రచన..   జోలపాట....
 
అమ్మ జోలపాట హాయిని గూర్చును
 శిశువు నిదుర నొదుగు చిన్ననాట  
జగము నేలు వారె చల్లగా నిదురించు
 రమ్య మయిన జోల లాలి పాట

రామయ్యకి యిచ్చె రత్నాల లాలిని  
నల్లనయ్య నచ్చె నంద లాలి  
వెంకన్నమెచ్చేను వకుళమ్మ లాలిని  
గణపతికిముద్దాయె గౌరి లాలి 


సమస్యా పూరణ..... తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి....

తనకు పెళ్ళిచేయతగిన ధనము లేక 
కలత పడుచున్న తలిదండ్రి కలలు తీర 
వయసుడిగినను మనసున్న వాని జూచి 
తాత నువివాహ మాడెను తరుణి మెచ్చి

No comments:

Post a Comment