శంకరాభరణం..(పూరణ..(జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్) పద్య రచన..(విశ్వాశఘాతకుడు)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో.....
సమస్యా పూరణ......జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్
ముంచుకు వచ్చిన ముప్పును
జంకక తలపడి నిలచిన జరుగును మేలున్
బింకముతో నెదిరించిన
జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్