Saturday, October 19, 2013

శంకరాభరణం..పద్యరచన(పరనింద) సమస్యా పూరణ..( కాలుడు హిమశైలసుతకు గాంతుండయ్యెన్)

-->
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో.... 
పద్య  రచన....పరనింద
పరనిందనుచేయవలదు
పరనిందలుపడుటవలదువసుమతిలోనన్
పరమాత్మకెరుకయనుచును
పరమార్దమ్ములనుతెలిసి బ్రతుకుట మేలౌ

ద్వేషభావమున్న దేహానికేగీడు
సహనగుణము గలుగ శాంతి నొసగు
తన్ను తానె బొగడ తలవంపు లేతెచ్చు
పరుల నింద చేయ పనికి చేటు
       సమస్యా పూరణ...   కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుండయ్యెన్
 
-->
శూలము చేతను బట్టిన
హాలా హలధరుడు మరుని అణచిన వాడున్
ఫాలుడు జడధారి మహా
కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుండయ్యెన్





No comments:

Post a Comment