Sunday, February 16, 2014

సమస్యా పూరణల..(తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్ 1294 ) ( ముక్కంటిని దూఱునెడల, మోక్షము గలుగన్ 1295 )




శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతలతో..

రయ్యన కృష్ణుని జంపగ  
నెయ్యముతో మాటలాడు నెలతనుజూడన్
 అయ్యది వంచన గనుగొని
 తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్
 


చిక్కులు కొనితెచ్చుకొనును     
ముక్కంటిని దూఱునెడల, మోక్షము గలుగన్
మక్కువతోసేవించిన
ఇక్కట్టులుతొలగిపోవు ఈశుని గొలువన్
 

No comments:

Post a Comment