Wednesday, February 12, 2014

శంకరాభరణం..(కర్ణపేయమ్ముగా పాడె గార్ధభమ్ము 1273)




 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..

వింత వార్తలు ప్రచురించు పేపరందు    
కంట బడెనొక్క వింతయె,కాల మహిమ!
గంగ డింటను బెరిగెడు ఖరము నొకటి
కర్ణ పేయమ్ముగా పాడె గార్ధ భమ్ము!

 

కొమ్మ రెమ్మల దాగుచు కోయిలొకటి
కర్ణపేయమ్ముగా పాడె,గార్ధభమ్ము
ఓండ్ర పెట్టుచు పాడగ నొక్కసారి
చిన్ని కోయిల భయపడి చెట్టు నొదిలె
 

No comments:

Post a Comment