Friday, February 14, 2014

(రాముడు విననియ్యకొనడు రామాయణమున్ 1276) (శంకరు డుమ కొఱకు, పారిజాతము దెచ్చెన్ 1277)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....


ప్రేమాయణమును జదువుచు 
 రామా! నీరామకోటి వ్రాతురె జనులున్
 తామస హరణా! అభినవ 
రాముడు విననియ్యకొనడు రామాయణమున్



పొంకము గాతను విచ్చెను        
శంకరు డుమ కొఱకు, పారిజాతము దెచ్చెన్
పంకజనాభుడు సత్యకు
వంకలు జెప్పక, ప్రియసతి వ్రతమును దీర్చెన్
 


పంకజముఖిసతి గోరగ
జంకక తెచ్చెదరుగాదె జాబిలి నయినన్
శంకకు తావీయకశివ
శంకరు డుమ కొఱకు పారిజాతము దెచ్చెన్
 





No comments:

Post a Comment