Monday, February 24, 2014

సమస్యా పూరణలు ( నరసింహుని బిలువ బలుకు, నరకాసురుడే..1319) ( పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్ 1320 )




శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....

కరుణించమనుచు భక్తులు 
నరసింహుని బిలువ బలుకు, నరకాసురుడే
పరులను హింసించుఖలుడు
మురహరినెదిరించితాను ముక్తిని బొందెన్





తిలకించితినొక వింతను  
పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్
తిలకించనైతి నిలలో
కలలో గాంచితిని నేను కడుచిత్రముగన్
 

No comments:

Post a Comment