Friday, February 14, 2014

(నారికేళజలమ్ము, ప్రాణమ్ము దీయు 1285) ( తాటకిని జంపె, భరతుడు తపసి కనగ 1286).



 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో,,,

కలుష మంటని జలముగ ఘనత కెక్కి  
మంచి చేయును జనులకు మందు వోలె

నారికేళజలమ్ము, ప్రాణమ్ము దీయు
 కల్తి సారాయి త్రాగిన కలియుగాన



తండ్రి నొప్పించి రాముడు తరలి వెళ్లి 
యాగ రక్షణ గావింప నడ్డగించు 
తాటకిని జంపె, భరతుడు తపసి కనగ
  రామ పాదుక సేవించి రాజ్య మేలె








No comments:

Post a Comment