Tuesday, February 11, 2014

శంకరాభరణం (కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్ 1260 ) (ముఱుగు కూపమున మునుగ ముక్తి గల్గు 1262)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో,,,,
  
నేరము లెంచని నెచ్చెలి         
తీరుగ నుండిన బ్రతుకున తీపియె గాదా
నారికి మేలగు నగ,నుడి
కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్


చిత్త మందున హరినామ చింతననిడి
నరక భాధల నందున నదురు బడక
స్వర్గ సుఖములు గోరని సద్గుణులకు
ముఱుగు కూపమున మునుగ ముక్తి గల్గు
 

No comments:

Post a Comment